Monday, December 23, 2024

ఎంపి సంజయ్‌సింగ్‌కు నామినేషన్ దాఖలుకు వెసులుబాటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్‌కు కోర్టు ఊరట కల్పించింది. రాజ్యసభ ఎన్నికలలో నామినేషన్ పత్రాల దాఖలుకు ఆయనకు అనుమతిని మంజూరు చేశారు. ఆయన వ్యక్తిగతంగా వెళ్లి రిటర్నింగ్ అధికారి ఎదుట తమ నామినేషన్ దాఖలు చేసుకోవచ్చునని, సంబంధిత ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ రూలింగ్ వెలువరించారు.

రాజ్యసభ సభ్యులుగా తిరిగి పోటీకి నామినేషన్ పత్రాలను దాఖలు చేసుకునేందుకు సంజయ్ సింగ్ ఈ పదవ తేదీలోగా ఎప్పుడైనా వెళ్లేందుకు అనుమతించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. 8వ తేదీన నామినేషన్ దాఖలు , 10వ తేదీన పత్రాల స్క్రూటినీకి వీలు కల్పించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులైన సంజయ్ సింగ్ సభ్యత్వ కాల పరిమితి ఈ నెల 27తో ముగుస్తుంది. ఈ స్థానం ఎన్నికకు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. దీనితో తాను నామినేషన్ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని ఈ ఎంపి కోర్టుకు విన్నవించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News