Saturday, December 21, 2024

పిపిఎల్ ఇండియా స్వతంత్ర డైరెక్టర్ గా సంజయ్ టాండన్‌

- Advertisement -
- Advertisement -

ముంబయి: నాలుగు మిలియన్లకు పైగా దేశీయ, అంతర్జాతీయ సౌండ్ రికార్డింగ్ లను లైసెన్సింగ్ కలిగిఉన్న సంస్థ, అలాగే 80 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కంపెనీ పీపీఎల్ ఇండియా. అలాంటి పీపీఎల్ ఇండియా… ప్రస్తుతం కాపీరైట్ అడ్మినిస్ట్రేషన్‌లో గౌరవనీయ వ్యక్తి, ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ (ISRA)కు సీఈఓగా వ్యవహరిస్తున్న సంజయ్ టాండన్ ను స్వతంత్ర డైరెక్టరుగా నియమించింది. సంజయ్ టాండన్ 27 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతేకాకుండా భారతదేశ సంగీత ప్రపంచంలో కాపీరైట్ యొక్క కలెక్టివ్ మేనేజ్‌మెంట్ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఈ నియామకం ద్వారా కళాకారులు/సంగీతకారులు, సంగీత కంపెనీలను ఒకచోట చేర్చి అందరికి సమానమైన వాతావరణాన్ని అందించినట్లు అయ్యింది.

తన నియామకం సందర్భంగా సంజయ్ టాండన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “పిపిఎల్ ఇండియా డైరెక్టర్ల బోర్డులో చేరడం గౌరవంగా భావిస్తున్నాను. సహకారం, అవగాహన, ఐక్యతను పెంపొందించడం ద్వారా, మేము అందరు వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే పర్యావరణ వ్యవస్థను సృష్టించగలమని గట్టిగా నమ్ముతున్నాను. పీపీఎల్ ఇండియా తన అభివృద్ధిని కొనసాగించేలా బోర్డు, మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి పనిచేయడానికి నేను సదా సిద్ధంగా ఉన్నాను. వినియోగదారుడు, కళాకారుడు/యజమాని కమ్యూనిటీలు సమిష్టిగా అభివృద్ధి చెందడానికి మరియు భారతదేశంలో మంచి కాపీరైట్ వాతావరణాన్ని తీసుకురావడంలో నా వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు ఆయన.

“పిపిఎల్ ఇండియా బోర్డులోకి స్వతంత్ర డైరెక్టర్ గా సంజయ్ టాండన్ ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన తన వ్యూహాత్మక దృక్పథంతో, పరిశ్రమ సవాళ్లను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించగలరు. అంతేకాకుండా మార్కెట్‌లో మ్యాజిక్ కంపెనీల యజమానులు, కళాకారుల మద్య వారధిగా మారగలరని భావిస్తున్నాను అని అన్నారు పిపిఎల్ ఇండియా చైర్మన్ మందార్ ఠాకూర్.

“మా సీఈఓ సంజయ్ టాండన్ పీపీఎల్ బోర్డులో చేరడంతో, గాయకులు, సంగీత కళాకారులు, సంగీత సంస్థల మధ్య బంధం మరింత బలపడింది. ఈ నియామకంతో ఆయన అనుభవం, నైపుణ్యం, సంగీత పరిశ్రమ యొక్క ప్రయోజనాలు, అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని మేము భరోసా ఇస్తున్నాము అని అన్నారు ఇస్రా చైర్మన్ అనూప్ జలోటా. “పిపిఎల్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ లో సంజయ్ టాండన్‌ భాగమైనందుకు మేము హృదయపూర్వకంగా, ఉత్సాహంగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన నైపుణ్యం, కాపీరైట్ విషయాలపై లోతైన అవగాహన, భారతీయ సంగీత పరిశ్రమలో అనుభవం ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా పీపీఎల్ బోర్డ్‌ కు ఆయన ద్వారా మరింత విలువ వచ్చి చేరినట్లు అయ్యింది అని అన్నారు పీపీఎల్ ఇండియా ఎండీ జి.బి.ఆయీర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News