Thursday, April 3, 2025

సీన్ రిపీట్.. లక్నో ఓనర్‌పై నెటిజన్లు ఫైర్

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సొంత మైదానంలో కింగ్స్ పంజాబ్ జట్టు చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌ తర్వాత లక్నో ఓనర్‌ సంజీవ్‌కు,కెప్టెన్ రిషబ్ పంత్‌కి మధ్య సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈసారి ఐపీఎల్ వేలంలో పంత్‌ను రూ.27 కోట్లు పెట్టి లక్నో ఫ్రాంచైజీ దక్కించుకుంది. కానీ.. పంత్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు.

దీంతో 2024లో జరిగిన సీనే మళ్లీ రిపీట్ అయిందని నెటిజన్లు కామెంట్ చేస్తారు. గత సీజన్‌లో లక్నో కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్‌పై కూడా ఇలానే విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు పంత్ విషయంలో ఇలాగే గొడవ చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క్రికెట్ అలా ఆడాలో ఆటగాళ్లు, కోచ్‌ చూసుకుంటారు. యజమాని జోక్యం చేసుకోవడం సరికాదు’, ‘ఇలాంటి యజమానిని ఎక్కడ చూడలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News