విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓటమిపాలైంది. లక్నో చేతిలో ఉన్న మ్యాచ్‌ని ఢిల్లీ ఆటగాళ్లు విప్రాజ్, అశుతోష్‌లు లాక్కొన్ని తమ జట్టు విజయాన్ని కట్టబెట్టారు. అయితే ఈ మ్యాచ్ తర్వాత జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మ్యాచ్ అనంతరం లక్నో సారథి రిషబ్ పంత్‌తో జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా మాట్లాడుతూ.. కనిపించారు. ఇది చూసిన నెటిజన్లు సంజీవ్.. పంత్‌కు క్లాస్ పీకి ఉంటారని భావిస్తున్నారు. ఇందుకు కారణం లేకుండా పోలేదు. గత ఏడాది లక్నో జట్టు ఓ మ్యాచ్‌లో ఓడిన తర్వాత కెప్టెన్ కెఎల్ రాహుల్‌పై సంజీవ్ ఫైర్ అయ్యారు. దీంతో ఆ దృశ్యం ఈ దృశ్యాన్ని కలిపి మీమ్స్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే సంజీవ్‌కి పంత్‌కి మధ్య సీరియస్ చర్చ ఏం జరగలేదని.. వాళ్లు సరదాగానే మాట్లాడుకున్నారని కొందరు అంటున్నారు.