Sunday, December 22, 2024

ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా

- Advertisement -
- Advertisement -

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు అయ్యారు. ఆయన అత్యున్నత న్యాయస్థాన గురుతర బాధ్యతలను నవంబర్ 11న ప్రమాణస్వీకారం తరువాత స్వీకరిస్తారు. ప్రస్తుత సిజెఐ డివై చంద్రచూడ్ ఈ నెల 10న బాధ్యతల నుంచి వైదొలుగుతారు. ఈ దశలో సీనియార్టీ ఇతర ప్రాతిపదికలపై జస్టిస్ సంజీవ్ ఖన్నాను ఈ పదవికి ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆయన దేశానికి 51వ ప్రధాన న్యాయమూర్తి అవుతున్నారు. రాజ్యాంగం ద్వారా లభించిన అధికార వినియోగించుకుని భారత రాష్ట్రపతి , ఇప్పటి సిజెఐతో సలహా సంప్రదింపుల తరువాత జస్టిస్ సంజీవ్ ఖన్నాను సిజెఐగా నియుక్తులు చేసినట్లు ,

ఇది నవంబర్ 11 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సామాజిక మాధ్యమంలో తెలిపారు. జస్టిస్ ఖన్నా 14 మే 1960 న ఢిల్లీలో జన్మించారు. న్యాయమూర్తుల కుటుంబం నుంచే వచ్చిన ఖన్నా విద్యాభ్యాసం ఎక్కువగా ఢిల్లీలోనే జరిగింది. వయస్సురీత్యా జస్టిస్ ఖన్నా ఆరు నెలలే బాధ్యతలలో ఉండాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మే 13వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగాలి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ 2022 నవంబర్ 22 వ తేదీన బాధ్యతలు తీసుకున్నారు. దీపావళి సెలవుల తరువాత బాధ్యతలనుంచి వైదొలుగుతారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News