Monday, April 7, 2025

మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా సంజూ రికార్డు..

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ మాజీ కెప్టెన్ షేన్ వార్న్‌ను వెనక్కినెట్టి.. ఆ జట్టు మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో విజయం సాధిండంతో సంజూ ఈ ఘనత సాధించాడు. మొత్తం 62 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన సంజూ.. 32 విజయాలు సాధించారు. 2021లో సారథ్య బాధ్యతలు తీసుకున్న సంజూ సంగతి తెలిసిందే. షేన్ వార్న్‌ను.. 55 మ్యాచ్‌ల్లో 31 విజయాలతో రెండో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ తొలి సీజన్‌లోనే వార్నర్.. రాజస్థాన్ కు ట్రోఫీ అందించాడు.

కాగా, నిన్న ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News