ముంబై : వెస్టిండీస్ సిరీస్ కోసం టీమిండియా టెస్టు, వన్డే జట్లను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. టెస్టు జట్టు నుంచి సీనియర్ బ్యాటర్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాకు ఉద్వాసన పలికారు. యువ క్రికెటర్లు యశస్వి జైస్వా ల్, రుతురాజ్‌లకు టెస్టు జట్టులో స్థానం లభించింది. మరోవైపు వన్డే జట్టులో కేరళ స్టార్ సంజూ శాంసన్ చోటు సంపాదించాడు. ఐపిఎల్‌లో మెరుగై ప్రదర్శన చేయడం సంజూకు కలిసి వచ్చింది. ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్‌గా జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ కూడా జట్టులోకి వచ్చాడు. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు జట్టులో చోటు లభించింది. సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లిని కూడా వన్డేలకు ఎంపిక చేశారు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తారని భావించినా అతన్నే కెప్టెన్‌గా కొనసాగించనున్నారు. హార్దిక్ అతనికి డిప్యూటీగా వ్యవహరిస్తాడు. ఉమ్రా న్ మాలిక్, సిరాజ్, కుల్దీప్, యజువేంద్ర, ముకేశ్ కుమార్‌లకు కూడా జట్టులో స్థానం దక్కింది.