Wednesday, January 22, 2025

టీ20 సిరీస్‌ నుంచి సంజూ శాంసన్ ఔట్

- Advertisement -
- Advertisement -

చాలా గ్యాప్ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న సంజు శాంసన్ ను దురదృష్టం వెంటాడుతోంది. ఒక్క మ్యాచుకే జట్టు నుంచి వైదొలిగాడు. శ్రీలంకతో తొలి టీ-20 ఆడి 5 పరుగులకే ఔట్ అయ్యాడు సంజు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 1వ T20Iలో బౌండరీ రోప్‌ల దగ్గర బంతిని ఫీల్డింగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సంజూ శాంసన్ తన ఎడమ మోకాలికి గాయం కావడంతో శ్రీలంకతో జరిగిన 3-మ్యాచ్‌ల T20I సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. శాంసన్ స్థానంలో ఇంతవరకు భారత జట్టు తరుఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని విదర్భ వికెట్ కీపర్-బ్యాటర్ జితేష్ శర్మ జట్టులోకి ఎంపికయ్యాడు. 2022లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జితేష్ శర్మ 163.64 స్ట్రైక్ రేట్‌తో 234 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News