Monday, December 23, 2024

సంక్రాంతి పండగ పూట విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

సంక్రాంతి పండగ పూట హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగరవేస్తూ ఓ బాలుడు ఇంటిపై నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని నాగోల్ లో చోటుచేసుకుంది. 13 ఏళ్ల శివప్రసన్న అనే బాలుడు ఇంటిపై గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

నిన్న రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్ లోనూ ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంటిపై పతంగి ఎగరవేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News