Wednesday, January 22, 2025

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడిపించాలని డిమాండ్…. చాంతాడంత వెయిటింగ్‌ …

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఎక్కడి నుంచైనా రావడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి ముందు రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోతారు. రెండు నెలల ముందే రైళ్లను రిజర్వేషన్ చేసుకున్నారు. జనవరి 10 నుంచి మొదలు పెడితే 17 తేదీ వరకు రైళ్లన్ని బుక్ చేసుకున్నారు.

ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాలకు రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. వెయిటింగ్ లిస్ట్‌లో ఒక్కో రైళ్లు దాదాపుగా 1000 వరకు ఉన్నట్టు సమాచారం. స్పెషల్ రైళ్లను నడపడంతో పాటు మరిన్ని రైళ్లను వేయాలని ప్రయాణికులను కోరుతున్నారు. సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు తన సొంతూరుకు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. కాజీపేట నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైన్ పనులు నిర్వహిస్తుండడంతో విజయవాడ వెళ్లే పలు రైళ్లను దర్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News