Sunday, December 22, 2024

సంక్రాంతికి వస్తున్నాం

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అద్భుతమైన హ్యాట్రిక్ కాంబినేషన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ ‘వెంకీఅనిల్3’ చాలా ఆసక్తిని పెంచింది. ఈ డైనమిక్ కాంబినేషన్ ఇప్పటికే రెండు పెద్ద హిట్‌లను అందించింది. ఇక శుక్రవారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ఖరారు చేశారు.

ఈ టైటిల్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, సంక్రాంతి రిలీజ్‌కి సరైన సినిమా అనిపించింది. టైటిల్ డిజైన్ రంగోలి, తుపాకీ ఎలిమెంట్స్ ఫెస్టివల్, సినిమా క్రైమ్ థీమ్‌లను సూచిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ లుంగీ ధరించి, స్పోర్టింగ్ షేడ్స్, తుపాకీ పట్టుకుని సీరియస్ పోజ్‌లో కనిపించారు. అతని ఆన్-స్క్రీన్ భార్య ఐశ్వర్య రాజేష్ సాంప్రదాయ లుక్‌లో, ఎక్స్ లవర్ మీనాక్షి చౌదరి మోడరన్ అవతార్‌లో ఉన్నారు. వెంకటేష్ లుక్ సాంప్రదాయ, స్టైలిష్ ఎలిమెంట్స్‌తో కట్టిపడేసింది, పోస్టర్‌లో వెంకటేష్ చరిష్మా అదిరిపోయింది. ఇప్పటికే డబ్బింగ్ పనులు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News