Sunday, December 29, 2024

డిసెంబర్ 3న ‘గోదారి గట్టు..’

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. బుధవారం మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టుకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.

రమణ గోగుల పాడిన ఈ పాట ఆయన కమ్ బ్యాక్ ని సూచిస్తుంది. ఈ క్రేజీ రొమాంటిక్ మెలోడీకి భాస్కరభట్ల రిరిక్స్ రాశారు. సాంగ్ పోస్టర్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక బ్యూటీఫుల్ మూమెంట్, వెన్నెల రాత్రి నేపథ్యంలో సెట్ చేయబడింది. హీరో వెంకటేష్ మరో హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలసి ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News