Monday, January 6, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ’సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి 14న ’సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “నన్ను పోలీసర్ ఆఫీసర్ పాత్రలో చూడటం ఆడియన్స్‌కి కూడా ఓ కొత్త అనుభూతినిస్తుంది.

మొదటిసారి ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు చేశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుండడం చాలా ఆనందంగా వుంది. హీరో -వెంకటేష్‌తో వర్క్ చేయడం సూపర్ ఎక్స్‌పీరియన్స్. ఆయనలో ఎప్పుడూ ఒక ఆనందం కనిపిస్తుంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. అనిల్, వెంకీది సూపర్ హిట్ కాంబినేషన్. -ఐశ్వర్య రాజేష్‌తో కలసి పని చేయడం హ్యాపీగా అనిపించింది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. -నేను నటించిన సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ కావడం ఇదే తొలిసారి. గోదారి గట్టు సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. తర్వాత నా పేరు ’మీను’ మీద వచ్చిన పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే బ్లాక్‌బస్టర్ పొంగల్ సాంగ్‌కి కూడా మంచి స్పందన వచ్చింది.

బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో సినిమా కూడా అలానే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. -అనిల్ కామెడీ టైమింగ్ అద్భుతం. కామెడీ తీయడం అంత సులభం కాదు. సీన్‌ను బాగా చేయడంలో అనిల్ ఆలోచనలు చాలా అద్భుతంగా వుంటాయి. నేను కామెడీ చేయడం ఫస్ట్ టైం. ’సంక్రాంతికి వస్తున్నాం’ – క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. -దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఈ సినిమా చేయడం అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. -ఇక ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తున్నాను. మరో రెండు సినిమాలు మేకర్స్ ప్రకటిస్తారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News