విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ’సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈనెల 14న ’సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
కథ అనుకున్నప్పుడే టైటిల్ ఫిక్స్ అయ్యాం…
వెంకటేష్‌తో చేసిన ఎఫ్ 2 సినిమా పొంగల్ కి వచ్చి పెద్ద విజయం సాధించింది. ఎఫ్ 3 మూవీ కూడా పొంగల్ కి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. ఈసారి చేసే సినిమా ఎలాగైనా పొంగల్‌కి తీసుకొస్తే బావుంటుందని సినిమా ఓపెనింగ్ అప్పుడే సంక్రాంతికి రావాలని అనుకున్నాం. కానీ అప్పుడు ప్రకటించలేదు. ఈ కథ ఒక రెస్క్యు ఆపరేషన్ కి సంబధించింది. సెకండ్ హాఫ్‌లో నాలుగు రోజులు జర్నీ సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. కథ అనుకున్నప్పుడే ’సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌కి ఫిక్స్ అయ్యాం.
ఆ క్రెడిట్ భీమ్స్‌కి దక్కుతుంది…
-భీమ్స్ ఇచ్చిన గోదారి గట్టు ట్యూన్ వినగానే ఒక పెక్యులర్ వాయిస్ తో పాడిస్తే బావుంటుదని అనుకొని రమణ గోగులని ఫస్ట్ ఆప్షన్‌గా ఎంచుకున్నాం. భీమ్స్ ఆయన్ని సంప్రదించి పాడించారు. ఈ క్రెడిట్ భీమ్స్‌కి దక్కుతుంది. రమణ గోగుల కూడా తన మార్క్ ని యాడ్ చేశారు. హిట్ సాంగ్ అనుకున్న పాట కాస్త ఈ రోజు గ్లోబల్ సాంగ్ అయ్యింది. 85 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.
ఇద్దరూ అదరగొట్టారు…
భాగ్యం క్యారెక్టర్ చాలా స్పెషల్. ఐశ్వర్య బెస్ట్ పర్ఫార్మర్. అయితే తను గోదారి యాస ఎలా పలుకుతుంది ? ఆ క్యారెక్టర్‌లో తన బా డీ లాంగ్వేజ్ ఎలా వుంటుందో తెలుసుకోవడానికి చిన్న ఆడిషన్‌లా చేశాం. భాగ్యం చాలా మంచి క్యారెక్టర్. ఐశ్వర్యకి మంచి పేరు వ స్తుంది. -మీనాక్షి కూడా క్రమశిక్షణ గల నటి. తనకి మంచి టైం సెన్స్ వుంది. చాలా చక్కగా నటించింది. ఇద్దరూ అదరగొట్టారు.
20 నిమిషాల్లో పాడేశారు…
వెంకటేష్‌కి బ్లాక్‌బస్టర్ పొంగల్ సాంగ్ చాలా నచ్చేసింది. ఆయనే స్వయంగా పాడతానని చెప్పారు. నేను షాక్ అయ్యాను. అదే టైమింగ్ లో ఓ రీల్ చేశాం. వెంకటేష్ 20 నిమిషాల్లో ఆ పాట పాడేశారు. వెంకీ పాడిన తర్వాత భీమ్స్ కూడా షాక్ అయ్యాడు.
అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు…
భీమ్స్ తో పని చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. పటాస్ సినిమా సమయంలో తనతో ఐదు పాటలు రెడీ చేయించాను. కానీ అది కుదరలేదు. మళ్ళీ ఈ సినిమాతో తనతో పని చేయడం హ్యాపీగా వుంది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. బీజీఎం వండర్ ఫుల్ గా వుంటుంది. సీన్ కి తగ్గట్టుగా మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది.
వారితో నాది పదేళ్ళ జర్నీ…
నిర్మాత దిల్ రాజుతో నేను పటాస్ సినిమా నుంచి ప్రయాణిస్తున్నాను. నాకు ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్ళతోనే ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. దిల్ రాజు, శిరీష్ అంటే నాకు ఫ్యామిలీ. వారితో నాది పదేళ్ళ జర్నీ.
వెంకీతో ఎంటర్‌టైన్‌మెంట్‌కే పెద్దపీట వేస్తా..
హీరో వెంకటేష్‌తో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల కంటే ’సంక్రాంతికి వస్తున్నాం’తో మా అనుబంధం డబు ల్ అయ్యింది. వెంకటేష్‌తో సినిమాలు ఇలానే వరుసగా చేయాలని భావిస్తున్నాను. -ఈ సినిమాతో ఆ యనతో ఒక డిఫరెంట్ జోనర్ ప్రయత్నించాను. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు క్రైమ్ రెస్క్యు అడ్వెంచర్‌లా సినిమా వుంటుంది. సెకండ్ హాఫ్ డిఫరెంట్ జోనర్‌లో వుంటుంది. వెంకీతో యాక్షన్ సినిమా చేసినా ఎంటర్‌టైన్‌మెంట్‌కే పెద్దపీట వేస్తాను.
హ్యాపీగా నవ్వుకొని వెళ్తారు…
ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్రతో ఈ సినిమా చేశాము. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. ట్రైలర్‌లో ఫన్ మూమెంట్స్ అలరించాయి. సినిమాలో చూడటానికి మంచి కం టెంట్ వుందని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. థియేటర్స్‌కి వచ్చాక అద్భుతంగా నచ్చితే సినిమా బ్లాక్‌బస్ట ర్. ఆడియన్స్ హ్యాపీగా నవ్వుకొని వెళ్తారు.
భవిష్యత్తులో స్పోర్ట్ డ్రామా చేస్తా…
ఉమెన్ సెంట్రిక్‌గా ఒక స్పోర్ట్ స్టొరీ చేయాలని ఎప్పటినుంచో వుంది. కొన్నాళ్ళ తర్వాత స్పోర్ట్ డ్రామా చేస్తాను. ఎఫ్ 4 మూవీ తప్పకుండా ఉంటుంది. ’సంక్రాంతికి వస్తున్నాం’ని కూడా ఫ్రాంచైజ్ చేసుకునే స్కోప్ వుంది.