Saturday, January 18, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయం తెలుగు ప్రేక్షకులది

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్‌బస్టర్ ’సంక్రాంతికి వస్తు న్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో పొంగల్ బ్లాక్‌బస్టర్ విజయా న్ని అందుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పొంగల్ బ్లాక్‌బస్టర్ జాతర సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ విజయం మరోసారి రుజువుచేసింది. ఇది మా విజయమే కాదు ఇం త గొప్పగా సపోర్ట్, లవ్ చేసిన తెలుగు ఆడియన్స్, ఫ్యాన్స్ సక్సెస్. ప్రేక్షకులు ఈ విజయాన్ని కోరుకున్నారు. ఇది ప్రేక్షకుల విజయం. సినిమాని అందరూ ఫ్యామిలీతో కలసి చూడటం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “నన్ను ఇంత బలంగా నమ్మిన వెంకటేష్‌కి థాంక్ యూ. ఇది మా హ్యాట్రిక్ మూవీ. ఇప్పటి వరకూ నేను తీసిన ఎనిమిది సినిమాలు.. ఒక్కొక్క సినిమా ఒక్కో జర్నీ. ఇందులో చివరి ఐదు సినిమాలు వరుసగా వందకోట్ల గ్రాసర్స్. చివరి ఐదు సినిమాలు యూఎస్ లో వన్ మిలియన్ గ్రాసర్స్. ఒక దర్శకుడిగా ఆడియన్స్‌కి ఎంత థాంక్‌ఫుల్‌గా ఉండాలో అర్ధం కావడం లేదు.

తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనం”అని పేర్కొన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “ఇది మాకు బ్లాక్‌బస్టర్ పొంగల్. ఈ సంక్రాంతిని మర్చిపోలేం. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ. వెంకటేష్ నిర్మాతల హీరో. ప్రతి డైరెక్టర్ ఇలాంటి కొత్త ఆలోచనలతో ప్రమోషన్స్ చేస్తే ఎంత అద్భుతం జరుగుతుందో అనిల్ మరోసారి నిరూపించారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శిరీష్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News