విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్‌బస్టర్ ’సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఈ నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు. డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ఆడియన్స్ లేకపోతే ఈ విజయాన్ని మేము ఊహించలేము. మార్నింగ్ షోస్‌కి ఫ్యామిలీస్‌తో కలిసి సినిమా చూశారంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అద్భుతాలు చూస్తూ ఎంజాయ్ చేయడమే. నా కెరీర్‌లో ఇది ఒక అద్భుతం. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ వెంకటేష్‌కి దక్కుతుంది. ఆయన సపోర్ట్‌ని మర్చిపోలేను. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య కూడా చాలా అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేస్తే ఆరు సినిమాలు దిల్‌రాజుతో చేశాను. ఎస్వీసి బ్యానర్ ఎన్నో గొప్ప సినిమాలు తీసిన బ్యానర్.
ఆ బ్యానర్ కొన్ని జనరేషన్స్ ఉండాలి, ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్‌కి వచ్చిన నెంబర్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి డిస్ట్రిబ్యూటర్స్‌కి మరచిపోలేనిదిగా నిలిచిపోతుంది. ఈ సినిమా ఆరు రోజుల్లో 100 కోట్లు షేర్ కొట్టింది. రీజనల్ ఫిలింకి చూడలేనేమో అనుకున్న 300 గ్రాస్ నెంబర్ చూడబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది”అని అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పెడతామని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని చెప్పుకునే పరిస్థితి నెలకొంది. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి.
కల్చర్ మారిపోయింది. 90 శాతం ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. జస్ట్ 10 శాతం మాత్రమే సక్సెస్. మా డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నింటిని తట్టుకుని మాతో జర్నీ చేస్తున్నారు. 20 ఏళ్ల పాటు ఒక ప్రొడ్యూసర్ తో డిస్ట్రిబ్యూటర్స్ కలిసి పనిచేయడం ఇండస్ట్రీలో చాలా అరుదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్యూ. బడ్జెట్ కాదు కథలే ముఖ్యం. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలు నిర్మించాం. మేము కూడా కాంబినేషన్స్ అని గత నాలుగు, ఐదు ఏళ్ళుగా తడబడుతున్నాం. అనిల్ మళ్ళీ మాకు రూటు చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషనల్ హిట్. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌తో ఒక రహదారి వేసి ఇచ్చాడు. మా సంస్థ నుంచి అద్భుతమైన సినిమాలు రావడానికి ఇది మాకు ఒక బిగ్ ఎనర్జీ. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శిరీష్, డిస్ట్రిబ్యూటర్‌లు సాయి కృష్ణ, రాజేష్, హరి, శోభన్, ఎల్వీఆర్ పాల్గొన్నారు.