- Advertisement -
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా మంగళవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. దీంతో తొలి రోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.45కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. వెంకటేశ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని తెలిపింది. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, భీమ్స్ సంగీతం అందించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా దూసుకుపోతోంది.
- Advertisement -