Thursday, January 23, 2025

సంక్రాంతి ఎఫెక్ట్.. ఫ్లైట్ చార్జీలు మూడు రెట్లు పెంపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పండుగ వేళ విమాన ప్రయాణికులకు షాక్ తగిలింది. సంక్రాంతి పండుగ ప్రభావం ఫ్లైట్ చార్జీలపై పడింది. పండుగ సందర్భంగా ప్రయాణికులు సొంతూళ్ల బాట పట్టారు. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్లు కిటకిట లాడుతుండటంతో విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో, విమానయాన సంస్థలు పండుగ రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా ఫ్లైట్ టిక్కెట్ ధరలను అమాంతం పెంచేశాయి.

ఈనెల 12, 13వ తేదీల్లో విమాన సంస్థలు టిక్కెట్టు ధరలను మూడు రెట్లు పెంచాయి. హైదరాబాద్ టు విజయవాడ విమాన చార్జీలు 10 నుంచి రూ.13 వేలు ఉండగా హైదరాబాద్ టు విశాఖ చార్జీ 12 నుంచి రూ.14 వేలు కాగా, హైదరాబాద్ టు రాజమండ్రి విమాన చార్జీలు రూ.12 వేలు అయ్యింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విమానయాన సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News