- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 17 సంక్రాంతి పండుగ సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా ఈ నెల 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో రెండు రోజులు ముందుగానే పాఠశాల విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 17 వరకు ఆరు రోజులు బడులకు సెలవులు ఇచ్చారు. తిరిగి స్కూళ్లు 18న ప్రారంభమవుతాయి. అలాగే ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు సెలవులు ఉండనున్నాయి. తిరిగి ఈ నెల 17వ తేదీన జూనియర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి.
- Advertisement -