పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎంపి బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని హిందూ బంధువులందరికీ బిజెపి నేత, ఎంపి బండి సంజయ్ కుమార్ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ భోగ భాగ్యాలను అందించాలని, సంక్రాంతి ప్రజల జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని, కనుమ పండుగ కన్నుల పండుగై మీ ఇంటిలో సుఖసంతోషాలు, ఆనందానురాగాలు పంచాలని ఆ అమ్మ వారిని వేడుకుంటున్నానన్నారు.
అంతేకాకుండా హిందువుల ఆత్మ గౌరవ ప్రతీక, భారతీయుల 5 శతాబ్దాల నిరీక్షణ… అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన అని.. ఈనెల 22న భవ్యమైన దివ్యమైన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతున్న శుభ సందర్భాన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈనెల 22న ప్రతి ఒక్కరూ మీ దగ్గరలోని ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శించుకుని, సాయంత్రం ప్రతి ఇంటా ఐదు దీపాలు వెలిగించి, వెలుగులు నింపాలని కోరారు.