Saturday, November 16, 2024

మహా నగరంలో… సంక్రాంతి సంబురం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో:  నగరం సంక్రాంతి శోభను సంతరించుకుంది… ఉదయం 6 గంటల సమయంలో ఏ వీధి చూసినా పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలతో ఆకర్షణీయంగా మారాయి. నగరంలోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా కూకట్‌పల్లి, నిజాంపేట, ప్రగతి నగర్,ఎఎస్‌రావు నగర్ తదితర ప్రాంతాల్లో పూర్తి పల్లె వాతావరణం కనిపించింది. సాధారణ రోజుల్లో ఇళ్ళు, అపార్ట్‌మెంట్‌లలో చిన్నపాటి ముగ్గులతో సరిపెడతారు. కాని సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రంగు, రంగులతో ముగ్గులు వేయడంతో అక్కడ ఆహ్లదకర వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా మంగళవారం భోగి పండగను పరస్కరించుకుని కాలనీల్లో, అపార్టుమెంట్‌లు, కూడళ్ళల్లో తమ ఇళ్ళలోని పాడైపోయిన కుర్చీలు, తలుపులు, ఇతర సామాగ్రితో భోగిమంటను వేసి దాని చుట్టు నృత్యాలు చేస్తూ సంక్రాంతి పర్వదినానికి స్వాగతం పలికారు.

చెడు రోజులు పోయి మంచి రోజులు రావాలని కోరుతూ పాటలు పాడారు. అంతే కాకుండా సమీపంలోని దేవాలయాలకు వెళ్ళి ఈ సంవత్సరం అంతా మంచి జరిగేలా దీవించమని తమ ఇష్టదైవాలను మొక్కుకున్నారు. అంతే కాకుండా కొన్ని వ్యాపార సంస్థల నిర్వహకులు తమ వ్యాపార సముదాయల్లో పూర్తి పల్లెవాతవరణం కనింపించే విధంగా చేసి కోనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు. హోటల్ నిర్వాహకులు సైతం భోగి స్పెషల్ పేరుతో ప్రత్యేక వంటకాలను తయారు చేసి‘ పల్లె రుచుల’ పేరుతో ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నారు.. ఈ విధంగా నగరంలో ఎవరికి తోచిన విధంగా భోగి పండగ ప్రత్యేకతను ప్రదర్శించండంతో నగరంలోని అనేక ప్రాంతాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

పతంగులతో నిండిన ఆకాశం: సంక్రాంతి పండగుకు మరో పేరుతో పతంగుల పండగ. ఈ సందర్భంగా నగరంలోని చిన్నా, పెద్దా గాలిపటాలను ఎగురవేయడంతో ఆకాశంలో సంక్రాంతి ముగ్గు వేసిన మాదిరిగా ఎక్కడ చూసినా రంగు, రంగులు గాలిపటాలు ఎగురుతూ కనిపించాయి.ముఖ్యంగా ఆదివారం పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర పశుసంవర్దక,మ్యత్స, పాడి పరిశ్రమల అభివృద్ది ,సినిమాటోగ్రఫీశాఖల మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ పతంగుల పండుగ ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, సంక్రాంతి పాటలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.అయితే గాలి పటాలకు మాంజా దారాన్ని వినియోగించడంపై నిషేదం ఉన్నా దీన్ని ఎవరూ పట్టించకున్నట్లు కనిపించలేదు. అధికారులు సైతం ఈ అంశాన్ని చూసిచూడట్లు వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News