మన తెలంగాణ / హైదరాబాద్: 13భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి దాదాపు కోటి మంది రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు తీసుకువస్తుందన్నారు.
రైతు భరోసాను రూ.12 వేలకు పెంచటంతో పాటు వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నగదు సాయం, ఆహార భద్రతను అందించే కొత్త రేషన్ కార్డులు, గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందని పారిశ్రామిక రంగాలన్నింటా రాష్ట్రం తిరుగులేని పురోగమనం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల్లో సంతోషాలు వెల్లవిరియాలి: పిసీసీ అధ్యక్షుడు
ఈ సంక్రాంతితో రైతులు, ప్రజలు వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లవిరియాలని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. సంక్రాంతి ప్రకృతితో అనుసంధానమైన పండుగఅని, ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసి రైతు మురిసిపోయే పండుగ అని తెలిపారు.
చైనా మాంజా వాడొద్దు: మంత్రి కొండా సురేఖ
భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా అటవీ, పర్యవారణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రజలకు శుభాకాంక్షులు తెలియజేశారు. మన రాష్ట్రం భోగభాగ్యాలతో, సిరసంపదలతోఓ సమృద్ధిగా వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజాను వాడరాదని కోరారు.