Sunday, December 22, 2024

జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి ’సంక్రాంతికి వస్తున్నాయ్’ కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ ట్రయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా 2025 సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది.

రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో హీరో వెంకటేష్ మాట్లాడుతూ “సంక్రాంతికి ఒక మంచి ఎంటర్‌టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అద్భుతంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకి, అభిమానులకు, కుటుంబాలకు అందరికీ ఈ సినిమా నచ్చుతుంది” అని అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో సంక్రాంతికి అడ్భుతాలను సృష్టించబోతున్నాం. అలాగే బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమా కూడా మేమే చేస్తున్నాం. ఈ మూడు సినిమా లు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి”అని పేర్కొన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మా ట్లాడుతూ “సంక్రాంతి వస్తున్నాం సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంక్రాంతికి నాకు స్పెషల్ కనెక్షన్ వుంది. నాకు ఇష్టమైన హీరో వెంకటేష్‌తో, నాకు ఇష్టమైన దిల్ రాజు, శిరీష్ బ్యానర్‌లో అందరినీ నవ్వించడానికి సంక్రాంతి వస్తున్నాం సినిమాతో వస్తున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, డా. నరేష్ వికే, వీటీవీ గణేష్, భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News