Wednesday, January 22, 2025

ఆదర్శ పురుషుడు సంత్ సేవాలాల్ మహారాజ్: ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మెదక్ : చేగుంట మండల కేంద్రంలో సేవాలాల్ 284వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి మండల కేంద్రంలో ప్రత్యేకంగా సేవాలాల్ చిత్ర పటాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. చేగుంట బస్ స్టాండ్ నుండి బారీ ర్యాలీ సుమారు 1000 మంది గిరిజనులతో ముఖ్యంగా మహిళలు బోనాలు, విద్యార్థులు జండాలను పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ర్యాలీలో పాల్గోన్నారు. ఎంపీతో పాటు ఎంపీపీ మాసుల శ్రీనివాస్, చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, బంజారా నాయకులు వలియా నాయక్, స్వాతి శ్రీనివాస్, మోహన్‌రాథోడ్, బిఖ్యా నాయక్ గణేష్, భద్యా నాయక్‌లతో కలసి ర్యాలీలో పా ల్గోన్నారు.

ఈ సందర్బంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ… సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్దాంతానికి పునాది వేసి అచరించిచూపారని తెలిపారు. బంజారాలు అనాడు రాజుల కాలం నుండి బ్రిటీష్‌కాలం వరకు అయా రాజ్యాలకు అవసరమైనయుద్ద సామాగ్రిని చేరవేస్తూసంచార జీవనం సాగిస్తూ ఉండే వారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ బోదనల వల్ల బంజారా జాతిపురోగమించడానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి,ఎంపీటీసీలు వలియా నాయక్,లక్ష్మి రమేష్, నందం, గనేష్,విశ్వేశ్వర్, సర్పంచ్‌లు మోహన్‌రాథోడ్, స్వాతి శ్రీనివాస్, సంతోష సిద్దిరెడ్డి, జానికి బిఖ్యా నాయక్, గ ణేష్,అంజిరెడ్డిలతో పాటు రంగయ్యగారి రాజిరెడ్డి,వివిద గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గిరిజన నాయ కులు,ప్రజా ప్రతినిదులు, మహిళలు,యువకులు సత్యం, యాదగిరి, తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News