Tuesday, November 26, 2024

యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ‘శాంతినికేతన్’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన , పశ్చిమబెంగాల్ లోని ప్రముఖ ప్రదేశం శాంతినికేతన్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు లభించింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందేళ్ల క్రితం విశ్వభారతిని నెలకొల్పారు. ఈ సమాచారాన్ని ఎక్స్ ద్వారా యునెస్కో తెలియజేసింది. బీర్‌భమ్ జిల్లాలో ఉన్న ఈ చారిత్రక సాంస్కృతిక కేంద్రానికి యునెస్కో గుర్తింపు కోసం సుదీర్ఘకాలంగా భారత్ కృషి చేస్తోంది. కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ సలహా పాలక వర్గం ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మోన్యుమెంట్స్ (ఐసిఒఎంఒఎస్ ) ఈ కేంద్రాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వజాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News