Tuesday, November 5, 2024

జెఎన్‌యు విసిగా శాంతిశ్రీ పండిట్ నియామకం

- Advertisement -
- Advertisement -

Santishree Pandit appointed as JNU Vice Chancellor

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) తొలి మహిళా వైస్ చాన్సలర్‌గా శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ నియమితులయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శాంతిశ్రీని జెఎన్‌యు వైస్‌చాన్సలర్‌గా నియమిస్తూ కేంద్ర విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 59 సంవత్సరాల శాంతిశ్రీ పండిట్ జెఎన్‌యులో ఎంఫిల్‌తోపాటు అంతర్జాతీయ సంబంధాలలో పిహెచ్‌డి చేశారు. జెఎన్‌యు విసిగా శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ నియామకాన్ని జెఎన్‌యు విజిటర్ అయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించినట్లు విద్యా శాఖ ప్రకటించింది. 1988లో గోవా విశ్వవిద్యాలయంలో తన అధ్యాపక జీవితాన్ని ప్రారంభించిన పండిట్ 1993లో పుణె విశ్వవిద్యాలయంలో చేరారు. యుజిసి సభ్యురాలిగా, ఇండియన్ కౌనిసల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్(ఐసిఎస్‌ఎస్‌ఆర్) సభ్యురాలిగా, కేంద్ర విశ్వవిద్యాలయాల విజిటర్స్ నామినీగా ఆమె ఉన్నారు. ఆమె తన అధ్యాపక జీవితంలో 29 పిహెచ్‌డిలను గైడ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News