Sunday, December 22, 2024

సంతూర్ సబ్బుల లారీ చోరీ

- Advertisement -
- Advertisement -

Santoor soaps lorry stolen in Hyderabad

ఇద్దరు నిందితుల అరెస్టు, పరారీలో ఇద్దరు
రూ.39.5లక్షల విలువైన సబ్బులు స్వాధీనం
వివరాలువ వెల్లడించిన సిపి మహేష్ భగవత్

హైదరాబాద్: సంతూర్ సబ్బుల లారీని చోరీ చేసిన ఇద్దరు నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, మహేశ్వరం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.38.5లక్షల విలువైన సబ్బులు, లారీని స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బి నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, పూణేకు చెందిన రాజేష్ వేద్ అలియాస్ మనోజ్ పర్‌మార్ నగరంలోని గాజులరామరంలో ఉంటూ స్వీట్స్ వ్యాపారం చేస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన సుశీల్ అలియాష్ అభిజిత్ గతంలో సంఘారెడ్డిలోని పెప్సీ కంపెనీలో పనిచేశాడు. మహారాష్ట్రకు చెందిన వెంకట్, పరీష్ పరారీలో ఉన్నారు. రాజేష్ వేద్ అలియాస్ మనోజ్ పర్‌మార్ గతంలో నగర శివారులో స్వీట్ హౌస్ నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే సుశీల్ బెహ్రా అలియాస్ అభిజిత్ పరిచయమయ్యాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో పూణేకు వెళ్లిపోయాడు.

ఇద్దరు కలిసి గూడ్స్ వాహనాల్లో దృష్టి మరల్చి చోరీలు చేయాలని ప్లాన్ వేశారు. నలుగురు కలిసి మధ్యప్రదేశ్‌లోని శ్రీసాయి ట్రాన్స్ పోర్టుకు ఏప్రిల్,2022లో వెళ్లారు, అక్కడ లారీని నెలకు రూ.70,000 ఇచ్చేందుకు లీజుకు తీసుకున్నారు. మే నెలలో హర్యానా నుంచి సంతూర్ సబ్బులను తీసుకుని బయలు దేరిన లారీ మహేశ్వరానికి రావాలి. కాని నిందితులు అందరూ కలిసి లారీతో పాటు పారిపోయారు. 27, జూన్,2022న కర్నాటకలోని తుముకూరు సమీపంలోని రద్రం గ్రమంలో రెండు షట్టర్లను తీసుకుని అందులో సబ్బుల లోడ్‌ను దింపారు. అక్కడి నుంచి ఆటోల్లో మచ్చబొల్లారానికి సబ్బుల బాక్సులను తరలించారు. ఇక్క బాక్సుకు రూ.3,000 చొప్పున 188 బాక్సులను విక్రయించాడు. విప్రో కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్లు సుధాకర్, మధుసూదన్, ఎస్సైలు ప్రతాప్‌రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News