Monday, December 23, 2024

సెహ్రీ కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ కుమార్..

- Advertisement -
- Advertisement -

Santosh Kumar participate in Sehri at Borabanda

హైదరాబాద్: రంజాన్ మాసం పురస్కరించుకుని బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఏర్పాటు చేసిన సెహ్రీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ‘రోజా’ను ఆచరిస్తారు. ఉపవాసానికి ముందు తెల్లవారుజామున సెహ్రీ ముందస్తు భోజనం తీసుకుంటారు. ఉపవాసం విడిచే ముందు ఇఫ్తార్‌ విందు ఆనవాయితి. జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బోరబండలో ముస్లిం సోదరులు గురువారం తెల్లవారుజామున 5 గంటలలోపు తీసుకునే సెహ్రీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంతోష్ కుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు స్వయంగా భోజనాలు వడ్డించారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు సెహ్రీ ఇవ్వడం అనందంగా ఉందని అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా బాబా ఫసీయుద్దిన్‌‌ అధ్వర్యంలో ప్రతిరోజు దాదాపు 400 మంది ముస్లీం సోదరులకు తెల్లవారుజామున భోజనాలు అందించడం చాలా గొప్పవిషయం అని కొనియాడారు.
హిందూ సోదరులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ వారికి భోజనాలు వడ్డించడం చాలా గొప్ప విషయమని తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అన్నారు. ఇంతమంచి కార్యక్రమం చేపట్టిన బాబాఫసీయుద్దిన్‌ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.

Santosh Kumar participate in Sehri at Borabanda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News