Saturday, November 23, 2024

సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ నాటకమని తేల్చిన పోలీసులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ నటకమని పోలీసులు తేల్చారు. ముగ్గురు ఆటో డ్రైవర్లు ఎత్తుకెళ్ళి తనను గ్యాంగ్ రేప్ చేసారంటూ యువతి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అయితే, కిడ్నప్, అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు దొరకలేదు. మెడికల్ రిపోర్టులోనూ అత్యాచారం జరగలేదని తేలింది. దీంతో పోలీసులు యువతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ప్రియడికి వివాహం నిశ్చయం కావడంతో కేసులో ఇరికేందుకు యువతి డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం యువతి పోలీసుల అదుపులో ఉంది.

Santosh nagar gang rape case: Woman filed false complaint

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News