Saturday, December 21, 2024

బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అన్నీ కొత్తగా…

- Advertisement -
- Advertisement -

సంతోష్ శోభన్ హీరోగా రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మించారు. రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అలాంటి వాడిపై సినిమా…
చాలా కాలంగా చాలా తెలుగు సినిమాల్లో కళ్యాణ మండపం మీద క్లైమాక్స్ ఉండే సినిమాలు కొన్ని ఉన్నాయి. అక్కడకు హీరో వచ్చి హీరోయిన్‌కు, ఆమె తండ్రికి కలిపి ఏవో నాలుగు నీతులు చెప్పి హీరోయిన్‌తో వెళ్లిపోతాడు. కానీ అక్కడడొకడు మిగిలిపోతాడు. వాడి పరిస్థితేంటో తెలియదు. ఎంత మందికి కార్డులిచ్చాడో, ఎన్ని అప్పులు చేశాడో… బట్టలు ఎలా కొనుక్కున్నాడో?… అనే విషయాలను ఎవరూ పట్టించుకోరు. అలాంటి వాడిపై అభిషేక్ చేసిన సినిమానే ప్రేమ్ కుమార్.
రియాలిటీ నచ్చింది…
అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా చేశాడు. తర్వాత దర్శకుడు కావాలని అనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథను తయారుచేసుకున్నాడు. ఈ కథ వినగానే నాకు బాగా నచ్చింది. అంతేకాకుండా కామెడీ అంటే చాలా ఇష్టం. అభిషేక్ రాసుకున్న విధానం బాగా నచ్చింది. రియాలిటీగా తను రాసుకున్న డైలాగ్స్ నచ్చాయి.
బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అన్నీ కొత్తగా…
ప్రేమ్ కుమార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం ఉంది. ఇందులో నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా ఇది.
నెక్స్ మూవీస్…
యువి క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో సినిమా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News