హైదరాబాద్: ఈనెల 18 న రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు,నాటడం, ప్రభుత్వ ఆసుపత్రిలలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, ఎస్.కే మాజిద్ లు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ రూపొందించిన గ్రీన్ ఛాలెంజ్ స్ఫూర్తిని కొన సాగించేందుకు ఇదొక వేడుకగా మలచుకోవలన్నారు.తద్వారా మానవాళికి అవసరమైన ఆక్సిజన్ తయారీకి గ్రీన్ ఛాలెంజ్ ఒక మార్గదర్శనంగా దోహదపడుతుందన్నారు.అందుకు సంతోష్ రావు ను అభినందిస్తూనే తెలంగాణా ఎలకృకల్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్లను యజమాన్యాలతో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశిషులతో పరిష్కరించిన నేత మంత్రి జగదీష్ రెడ్డి అని వారు కొనియాడారు.
అందుకు గాను ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించమన్నారు.అందుకు గాను మానవ మనుగడకు దోహద పడే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంచుకొని గ్రీన్ ఛాలెంజ్ కు అండగా నిలబడాలని తీర్మానించామన్నారు.తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ కార్యక్రమం దోహద పడే రీతిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించిందని వారు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులలో పాటు ప్రతి రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఏరియా ఆసుపత్రిలలో రోగులకు పండ్ల పంపిణీ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ స్టేషష్ నల ఎదుట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.