Thursday, January 23, 2025

గ్రామాల్లో ప్రతిచోట మొక్కలు నాటాలి

- Advertisement -
- Advertisement -
  • సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి: పట్టణాలు, గ్రామాల్లో ప్రతి చోట వర్షాలు కురిసినందున మొక్కలు నాటాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు పడుతున్నందున గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో స్కూల్స్, కాలేజీలో మొక్కలు నాటాలని అన్నారు. యూకలిప్టస్, గానుగ మొక్కలు వంటి వాటికి ప్రాధాన్యత నివ్వాలన్నారు. కొత్త ప్రాంతాలను గుర్తించి హరిత హారం టార్గెట్ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సొంత గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు లేని గ్రామాల వివరాలు అందజేయాలన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఆరోగ్యకరమైన గొర్రెలను లబ్దిదారులకు అందజేయాలని, వాల్యుయేషన్ ఫిట్నెస్ సర్టిఫికెట్ డిపార్ట్‌మెంట్ సరిచూసి లబ్ధిదారులకు జారీ చేయాలన్నారు.

జిల్లాలో వెనుకబడిన వర్గాల్లో కులవృత్తులకు చేతి వృత్తిదారులకు లక్ష రుపాయల ఆర్థిక సహాయానికి వచ్చిన దరఖాస్తుల పారదర్శకత పాటించి ఎంపిక చేయాలన్నారు. అభ్యర్థుల బయస్సు 18 నుంచి 55 సంవత్సరాలలోపు ఉండాలని, కుటుంబ వార్షికాదాయం గ్రామాలకు లక్షన్నర, పట్టణాలకు రెండు లక్షలు తప్పనిసరిగా ఆదాయ ధృవ పత్రం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిఆర్‌ఓ నగేష్, డిపిఓ సురేష్ మోహన్, డిఆర్‌డిఎ పిడి శ్రీనివాస్, పశు సంవర్దకశాఖ అధికారి వసంతకుమారి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News