Thursday, January 23, 2025

ఎస్సారెస్పీ భూముల్లో మొక్కలు నాటాలి

- Advertisement -
- Advertisement -

వరంగల్ : ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు ఇరువైపులా భూముల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్య అధికారులకు సూచించారు. బుధవారం సంగెం మండలంలోని తీగరాజుపల్లి ఎస్సారెస్పీ భూములను ఆమె పరిశీలించి వాటిలో హరితహారం మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. గాంధీనగర్ గ్రామ శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కా లువకు సంపద వనాలను ఆమె పరిశీలించారు. చాలా బాగా ఉందన్నారు.

తిమ్మాపురం గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ పరిశీలించి మొక్కలను చూసి చాలా బాగా ఉంద ని, పంచాయతీ కార్యదర్శి శ్రావణిని అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు ఇరువైపులా ఉన్న భూముల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని రక్షించే బాధ్యత స్థానిక సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు చూసుకోవాలన్నారు.

కలెక్టర వెంట వరంగల్ డీఆర్డీఏ పీడీ సంపత్‌రావు, ఎంపీపీ కళావతి, తహసీల్దారు రాజ్‌కుమార్, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రావు, ఎంపీఓ కొమురయ్య, ఏపీఓ లక్ష్మి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరహరి, వైస్ ఎంపీపీ మల్లయ్య, గోపాల్, గన్ను సంపత్‌తోపాటు అధికారులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News