Friday, December 20, 2024

మొక్కలు నాటిన అశోక్ అగర్వాల్, ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్,ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షులు, ఐవీఎఫ్ జాతీ య కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఐవీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్,ఐవీఎఫ్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ న్యూఢిల్లీ గంజి రాజ మౌళి గుప్తాలు ఉప్పల్‌లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఐవిఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ, గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంపి సంతోష్ చేస్తున్న కృషిని అభినందించారు. ఐవిఎఫ్ తరపున దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో పది లక్షల మొక్కలు నాటి ఎంపి సంతోష్‌కు తమ వంతుగా ఈ గ్రీన్‌చాలెంజ్ ఉద్యమంలో భాగస్వాములమవుతామన్నారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించినందుకు ఎంపి సంతోష్‌ని కొనియాడారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి వివిధ రంగాల ప్రముఖులను భాగస్వామ్యం చేసి గ్రీన్ ఇండియా చాలెంజ్‌ని ఎంతో విజయవంతంగా తీసుకువెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమములో పాల్గొనేందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులము ఎప్పుడు ముందుంటామన్నారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News