Friday, December 27, 2024

అమెరికా చరిత్రలోనే తొలిసారి

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ చరిత్ర సృష్టించారు. సెనేట్‌కు జరిగిన ఎన్నికల్లో విజయం మెక్‌బ్రైడ్ విజయం సాధించారు. తొలిసారి అధికారికంగా సెనేట్‌లోకి అడుగు పెట్టనున్న ట్రాన్స్‌జెండర్‌గా మెక్‌బ్రైడ్ రికార్డులకు ఎక్కారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున డెలావర్ నుంచి సెనేట్‌కు పోటీ చేసిన సారా మెక్‌భ్రైడ్ ఈ ఘనత సాధించారు. వోటర్లు ఆమెకు పట్టం కట్టారు. మంగళవారం పోలింగ్ ముగిసిన తరువాత వోట్ల లెక్కింపులో మెక్‌బ్రైడ్ ఆధిక్యం కనబరిచారు. మూడింట రెండు వంతుల మంది వోటర్లు ఆమెకే వోటు వేశారు. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి జాన్ వాలెన్ 3పై ఆమె సునాయాసంగా గెలుపొందారు. సెనేటర్‌గా గెలిచిన తరువాత సారా మెక్‌బ్రైడ్ సోషల్ మీడియాలో స్పందించారు.

‘పునరుత్పత్తి విషయంలో స్వేచ్ఛను పరిరక్షించేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందనే విషయాన్ని డెలావర్ వోలర్లు గట్టిగా చాటి చెప్పారు. అమెరికన్లుగా మన అందరికీ కావలసిన ప్రజాస్వామ్యం ఇదే’ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను గెలిస్తే చైల్డ్ కేర్‌కు సంబంధించిన ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంటానని, ఉద్యోగస్థులకు పెయిడ్ ఫ్యామిలీ, మెడికల్ లీవ్ సౌకర్యం కల్పిస్తానని, హౌసింగ్, హెల్త్ కేర్ విషయాల్లో మెరుగైన వసతులు కల్పిస్తానని మెక్‌బ్రైడ్ హామీ ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణకు పాటుపడతానని, సభలో వారి తరఫున గళం వినిపిస్తానని సారా మెక్‌బ్రైడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News