Sunday, December 22, 2024

మాజీ ప్రియురాలి తల్లిపై ప్రియుడు కాల్పులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మాజీ ప్రియురాలిపై అనుమానంతో ఆమె తల్లిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఢిల్లీలోని సరాయి రోహిళ్ల ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంకిత్ కౌశిక్ అనే యువకుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి మెలిసి తిరిగారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. యువతిపై అనుమానం పెంచుకున్న యువకుడు ఆమె ఇంటికి వెళ్లి కూతురుతో మాట్లాడాలని అడిగారు. ఆమె కుటుంబ సభ్యులు బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పిస్తోల్ తీసుకొని మాజీ ప్రియురాలి ఇంటికి చేరుకొని ఆమె తల్లి పై తుపాకీతో కాల్చడంతో చనిపోయింది. అనంతరం బయట నుంచి డోర్ లాక్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని నోయిడాలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News