Monday, December 23, 2024

భూ ఆక్రమితపై ‘వార్తరాస్తే సారుకు కోపమొచ్చింది’

- Advertisement -
- Advertisement -

చర్ల : భూ ఆక్రమితపై వార్తరాస్తే చర్ల తహశీల్దార్‌కు కోపం కట్టలు తెంచుకుంది.మన తెలంగాణ విలేఖరికి కాల్ చేసి తమను సంప్రదించకుండా వార్త ఎలా రాస్తావంటూ మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే సోమవారం ‘మన తెలంగాణ’ దిన పత్రికలో ‘ప్రభుత్వ భూమిలో వెలసిన పాకలు’ అనే కథనం వెలువడిన విషయం పాఠకులకు విథితమే. ఈ కథనంపై ఓ వైపు అభినందనలు వెల్లువెత్తుతుంటే మరోవైపు ఎంఆర్‌ఒ సారుకు కోపమొచ్చింది. సోమవారం సాయంత్రం ‘మన తెలంగాణ’ విలేఖరికి వాట్స్‌ప్ కాల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వు రాసిన వార్తపై ఎస్‌పి, సిఐలకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆధారాలతో తన కార్యాలయానికి రావాలంటూ హుకుం జారీ చేశాడు.

ఏ వార్త రాయాలో ఏ వార్త రాయకూడదో తెలియదా అంటూ చిర్రెత్తి పోయాడు. భూ ఆక్రమిత వార్తపై విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిన రెవెన్యూ అధికారులు ఆక్రమాణదారులకు అండగా నిలుస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సైతం అక్రమ గ్రావెల్ తోలకాలపై వార్త రాస్తే సదరు అధికారి ఇదే రీతిలో బెదిరింపులకు దిగాడు. మరోమారు అక్రిడేషన్ జర్నలిస్టులకు మాత్రమే స్పందిస్తాననే వాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సారు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మండలంలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే అరోపణలు ఉన్నాయి. భూ ఆక్రమితపై వార్త రాసిన విలేఖరిపై ఎంఆర్‌ఒ బెదిరింపులకు దిగడం పలువురు తప్పుబట్టారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరవృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News