Monday, December 23, 2024

ఆద్యంతం ఆసక్తికరంగా సారంగపాణి జాతకం టీజర్

- Advertisement -
- Advertisement -

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ’సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ’జెంటిల్‌మన్’, ’సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… “ప్రియదర్శి ఆసక్తికరమైన కథల్లో లీడ్ రోల్స్ చేస్తూ మంచి సినిమాలు అందిస్తున్నాడు. అతను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ’సారంగపాణి జాతకం’ టీజర్ ఇప్పుడే చూశాను. అందులో… దర్శి పాత్రకు జాతకాల మీద నమ్మకం ఉంటుంది. ’సారంగపాణి జాతకం’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

ఇక ’సారంగపాణి జాతకం’ టీజర్ విషయానికి వస్తే… హీరో జాతకాలను బాగా నమ్ముతాడు. ’మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని చెబుతాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, నిజమైన రోజు చుట్టుపక్కల ఎవరున్నారు? ఏం అవుతుంది? అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేసే యువకుడు. మరి, ఆ జాతకాలపై అమితమైన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లికి సిద్ధమైన మండపంలో ఒకరిని సారంగపాణి ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు? నరేష్‌ను ఎందుకు కత్తితో పొడిచాడు? అది నిజమా? కలా? అతని జీవితంలో కీచకుడు ఎవరు? కీచకుడిగా తనికెళ్ళ భరణి ఎటువంటి క్యారెక్టర్ చేశారు? సుందరమ్మ మరణిస్తే హీరో ఎందుకు హ్యాపీగా ఫీలయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు డిసెంబర్ 20న థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News