Sunday, December 22, 2024

వినోదాత్మక సినిమా అంటే ‘సారంగపాణి జాతకం’ మే

- Advertisement -
- Advertisement -

జెంటిల్‌మన్, సమ్మోహనం వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… “మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం ’సారంగపాణి జాతకం’. చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖ పరిసర ప్రాంతాల్లో 5 షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేశాం. ఈ నెల 12 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. నాకు ఎప్పటి నుంచో పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా తీయాలని ఉండేది. మా సంస్థలో రెండు విజయవంతమైన సినిమాలు తీసిన మోహనకృష్ణ ఇంద్రగంటితో పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయడం మాకు ఆనందంగా ఉంది”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News