Thursday, April 3, 2025

చక్కని హాస్యభరిత సినిమా సారంగపాణి జాతకం

- Advertisement -
- Advertisement -

ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా ఏప్రిల్ 18న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో నిర్మాత శి వలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “మంచి కామెడీ సినిమా తీ యాలన్న కోరిక ‘సారంగపాణి జాతకం’తో తీరింది. ఈ సినిమా ని రెండు నెలల ముందే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, తొందరగా విడుదల చేయడం, పుష్ప -2 స్వింగ్‌లో విడుదల చే యడం మంచిది కాదు… ఇది సమ్మర్‌లో కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అనే ఉద్దేశంతో ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నాను.

ఇది జాతకాల మీద తీసిన సినిమా. ‘సారంగపాణి జాత కం’ కథ విన్న తర్వాత ‘అద్భుతం.. మనం హిట్ కొడుతున్నాం’ అని అన్నాను. ఆ నమ్మకంతో ఈ సినిమాని నిర్మించాను”అని అన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ “శివలెంక కృష్ణప్రసాద్ కాంబినేషన్‌లో ఇది నాకు మూడో సినిమా. ఆయన నన్ను నమ్ముతారు. ఆ నమ్మకం ఇద్దరిమధ్య కొనసాగుతోంది. ‘సారంగపాణి జాతకం’ సకుటుంబ సపరివార సమేతంగా మాత్రమే కాకుండా పర కుటుంబ సమేతంగా కూ డా చూడదగ్గ చక్కని హాస్యభరిత సినిమా. ప్రియదర్శితో కలసి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది”అని తెలిపారు. కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ “ఇంద్రగంటి దర్శకత్వంలో నటించాలన్న నా కల ‘సారంగపాణి జాతకం’ సినిమా తో తీరింది. ఫేవరెట్ టీచర్ దగ్గర చదువుకోవడం లాంటిది ఆ యనతో పనిచేయడం. మా యూనిట్ అందరి జాతకాలు చాలా బాగున్నాయి. మేం చక్కని విజయాన్ని అందుకోబోతున్నాం”అ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయిక రూప కొడువాయూర్, శ్రీనివాస్ అవసరాల, నివితా మనోజ్, సమీర భరద్వా జ్, పీజీ విందా, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News