Sunday, October 27, 2024

’సారంగపాణి జాతకం’ నుంచి ‘సారంగో సారంగా..’ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ’సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువాయుర్ ఇందులో జంటగా నటించారు. జెంటిల్‌మన్, సమ్మోహనం తరువాత శ్రీదేవి మూవీస్, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇందులో మొదటి పాట ‘సారంగో సారంగా…’ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. విడుదలైన కాసేపట్లోనే వీక్షకులని, శ్రోతల్ని అమితంగా ఆకట్టుకోవడంతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ఈ పాట గురించి దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ “ఈ సినిమాలో కథానాయకుడు ప్రియదర్శి పేరు సారంగపాణి. అతని ప్రేమకథ నేపథ్యంలో వచ్చే పాట ఇది. ఓ రకంగా ఆ ప్రేమ కథకి మూలాధారం ఈ పాట. నిత్యజీవితంలో తనకి తారసపడే వారితో సారంగపాణి తన ప్రేమని ఎలా ఆవిష్కరించాడో అన్నదే ఈ పాటలో ప్రధానం. హైదరాబాద్‌లోని విభిన్న ప్రదేశాల్లో ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్‌లపై వినూత్నంగా చిత్రీకరించాం. ఈ పాటలో అర్మాన్ మాలిక్ గళంలో రామజోగయ్య శాస్త్రి పద చాతుర్యం కొత్త పుంతలు తొక్కినట్టుగా అనిపిస్తుంది. వివేక్ సాగర్ మధురమైన స్వరాలతో ఈ పాటని తీర్చిదిద్దారు. ఇక సినిమాలో సరికొత్త ప్రియదర్శిని చూడబోతున్నారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News