Thursday, April 3, 2025

నేటి నుంచి సరస్ మేళా

- Advertisement -
- Advertisement -

గ్రామీణ చేనేత, హస్తకళల ప్రదర్శనను ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మనతెలంగాణ/ హైదరాబాద్ : సెర్ప్, దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి చేనేత, హస్తకళల సరస్ మేళా కొనసాగనున్నది. నెక్లెస్ రోడ్‌లోని హెచ్‌డిఎంఎ మైదానంలో శుక్రవారం ఈ ప్రదర్శనను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు.

సరస్ మేళాలో ఆదిలాబాద్ డోక్రా, లోహపు బొమ్మలు, పోచంపల్లె ఇక్కత్ చీర్లు, గద్వాల్ పట్టు చీరెల్లు, భద్రాచలం వెదురు బొమ్మలు, అగర్‌బత్తీలు, హెర్బల్ ఉత్పత్తులు, జనగాం మసాలా దినుసులు, ఆసిఫాబాద్ గిరిజన హస్తకళాకృత్యలు, సిరిసిల్ల చేనేత ఉత్పత్తులు, నిర్మల్ పెయింటింగ్స్‌తో పాటు దేశంలోని 19 రాష్ట్రాలలోని స్వయం సహాయక సభ్యుల చేనేత, హస్తకళల సంబంధించిన దాదాపు 300 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన 6వ తేదీ నుంచి 16వ తేది వరకు కొనసాగనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News