Thursday, January 23, 2025

మలయాళ రచయితకు సరస్వతి సమ్మాన్

- Advertisement -
- Advertisement -

మలయాళ కవి, సాహితీవేత్త ప్రభావర్మకు సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారం దక్కింది. ఆయన రాసిన నవల రౌద్ర సాత్వికంలోని కవితాత్మకత విలువలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు పురస్కార వ్యవస్థాపకులు అయిన కెకె బిర్లా ఫౌండేషన్ ఓ ప్రకటన వెలువరించింది. దేశంలో సాహిత్య సృజన విషయంలో ఈ పురస్కారాన్ని అత్యున్నతంగా పరిగణిస్తారు. ఉన్నత స్థాయి చాయన్ పరిషత్ జరిపిన పరిశీలన క్రమంలో ఈ అవార్డుకు ఈ కవిని ఎంపిక చేశారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అర్జన్ కుమార్ సిక్రీ సారధ్యం వహించారని ప్రకటనలో తెలిపారు.

2013 నుంచి 2022 మధ్యకాలంలో ప్రచురితం అయిన పలు పుస్తకాలను పరిశీలించడం జరిగింది. మొత్తం 22 భాషల నుంచి ఒక్కో రచనను ఆహ్వానించి, వీటిలో చివరికి ఈ రచయిత పుస్తకానికి అవార్డును ప్రకటించారు. రౌద్ర సాత్వికంల అధికారం , రాజకీయాల మధ్య పోరు , వ్యక్తులు, ప్రభుత్వాల ఘర్షణ, కళలు అధికారం నడుమ వివిదాలు వంటివి అత్యంత విశిష్ట రీతిలో రచయిత విశ్లేషించారని ప్రకటనలో తెలిపారు. వర్మకు ఇప్పటికే 70కి పైగా అవార్డులు వచ్చాయి. ఈ అత్యున్నత పురస్కారం దక్కించుకున్నందుకు ఈ కవికి కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్, సిఎం పినరయి విజయన్ అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News