Thursday, January 23, 2025

ముక్కలు చేశాడు.. కుక్కర్‌లో ఉడికించాడు!

- Advertisement -
- Advertisement -

తనతో సహజీవనం చేస్తున్న మహిళను అతి కిరాతకంగా
చంపిన దుర్మార్గుడు ముంబైలో దారుణ ఘటన

ముంబయి: శ్రద్ధా వాకర్ తరహా మరో సహజీవన దారుణం జరిగింది. ముంబై మహానగరంలో ఓ వ్యక్తి తనతో పాటు కలిసి జీవిస్తున్న 32 ఏండ్ల మ హిళను చంపేసి, శరీరాన్ని ముక్కలు చే సి తరువాత వాటిని కుక్కర్‌లో ఉడికించాడు. చూ స్తేనే పరమ కిరాతకంగా ఉండే ఈ వ్యక్తి అత్యంత క్రూరంగా తన సహజీవిని అంతమొందించిన తీ రు మహానగరంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ముంబైలో వీరు నివాసం ఉంటున్న ఇంటి నుంచి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ శరీర ప్లాస్టిక్ బ్యాగులలో తీసుకువెళ్లారు. కలిసి ఉండి తరువాత కలహించుకుని ఈ క్రమంలో పరమ కిరాతకంగా వ్యవహరించి దారుణానికి పాల్పడుతున్న ఇటువంటి వైనాల్లో ఇ ప్పుడు ముంబైలో మరోటి చోటుచేసుకుంది. దీని గురించి గురువారం ముంబై పోలీసు అధికారులు తెలియచేశారు.

Also Read: రెండో విడత గొర్రెల పంపిణీకి సర్వం సిద్దం

బాధితురాలు సరస్వతి వైద్య (32 )గా గుర్తించారు. నరరూప రాకాసి బాపతు మగో డు ఆమెను చంపి, కొన్ని శరీరభాగాలను బాయిలర్‌లో మరగనిచ్చినట్లు వెల్లడైంది. మీరా రోడ్డులోని గీతానగర్ ప్రాంతంలో ఓ పలు అంతస్తుల భవనం లో ఏడో ఫోర్లులో వీరు నివాసం ఉంటున్నారు. బు ధవారం అర్ధరాత్రి తరువాత దారుణ ఘటన జరిగిందని నయానగర్ పోలీసు స్టేషన్ అధికారులు తె లిపారు. సంబంధిత ఘటనలో దారుణానికి పాల్ప డ్డ 56 ఏండ్ల మనోజ్ సానేను పోలీసులు అరెస్టు చేసి, విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మ నోజ్ సానే గత మూడేండ్లుగా ఈ మహిళతో కలిసి నివసిస్తున్నాడు. ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని జీవిస్తు న్న వీరి గురించి ఇప్పుడు వివరాలు ఈ ఘోరాతిఘోర నేరంతో వెలుగులోకి వచ్చాయి. వీరి ఫ్లాట్ నుంచి తెల్లవారుజామున దుర్వాసన వస్తోందని అపార్ట్‌మెంట్ నివాసులు పోలీసులకు తెలియచేశారు.

దీనితో విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. పక్క ఫ్లాట్‌లో ఉంటున్న శ్రీవాత్సవ్ అనే వ్యక్తికి పొద్దునే దుర్వాసన రావడంతో వెళ్లి తలుపు తట్టాడు. చాలా సేపటివరకూ తలుపు లు తీయని సానే లోపల స్ప్రేకొట్టి బయటకు వచ్చి తాను బయటకు వెళ్లుతున్నట్లు కంగారుగా చెప్పడంతో అనుమానం పెరిగింది. వెంటనే వాచ్‌మెన్‌ను , ఇతరులను అలర్ట్ చేయడంతో పోలీసులు వచ్చి దారుణం గుర్తించారు. ఈ ఫ్లాట్‌లోని ఈ జంట ఎప్పుడూ ఇరుగుపొరుగుతో కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉండేదని అపార్ట్‌మెంట్ వారు తెలిపారు.

కుళ్లిన శరీర భాగాలతో దారుణ పరిస్థితిలో

అపార్ట్‌మెంట్‌కు వచ్చిన పోలీసు అధికారులు అక్కడ కన్పించిన కుళ్లిన శరీరభాగాలు కంగుతిన్పించాయి. పలు ముక్కలు ముక్కలుగా ఆమె నరికివేయబడి ఉన్నట్లు గుర్తించినట్లు ముంబై డిసిపి జయంత్ బజ్‌బాలే తెలిపారు. మహిళను దారుణరీతిలో చంపివేసినట్లు నిర్థారించుకున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే సానేను అదుపులోకి తీసుకున్నారు. ఈ మహిళను ఎందుకు ఇంత దారుణంగా చంపివేశాడనేది తెలుసుకుంటున్నామని, దర్యాప్తు చేపట్టామని జయంత్ వివరించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని దారుణానికి పాల్పడ్డ వ్యక్తి చెపుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పరిస్థితి తమనే పూర్తిగా కలిచివేసిందని, దారుణంగా బలి అయిన మహిళకు తగు న్యాయం కల్పించేందుకు కట్టుబడి ఉంటామని జయంత్ తెలిపారు.

వీరి వివరాల గురించి సమాచారం ఉంటే పౌరులు ఎవరైనా తమకు తెలియచేయాలని కోరారు. గత ఏడాది శ్రద్ధా వాకర్ అనే మహిళను కూడా సహజీవి ఇదే విధంగా ఢిల్లీలో దారుణంగా హత్య చేసి, శరీరభాగాలను ఫ్రిజ్‌లో పెట్టి ఉంచారు. 27 సంవత్సరాల శ్రద్ధా కాల్ సెంటర్ ఉద్యోగిని, తనతో పాటు కలిసి ఉంటూ వచ్చిన ఆవారాతరహా అఫ్తాబ్ పూనావాలాను గొంతు నులిమి చంపివేసి, తరువాత ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి మెల్లమెల్లగా వాటిని సమీపంలోని అడవులలో పారవేస్తూ వచ్చాడు. పైగా కొన్ని భాగాలను ఫ్రిజ్‌లో పెట్టాడు. ఆమె గుర్తు లేకుండా చేసేందుకు ముఖాన్ని చెరిపివేశాడు. ఏడాదిగా ఈ కేసులో శ్రద్ధాకు న్యాయం కోసం విచారణ సాగుతోంది. ఈ దశలో ఇటువంటి ఇంతకు మించిన దారుణం చోటుచేసుకుంది. అయితే ఘటన తరువాత ఆరునెలలకు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా వాకర్ తండ్రి తన కూతురు కన్పించకుండా పోయిందని , సమాచారం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు క్రమంలో అఫ్తాబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అఫ్తాబ్ ఇప్పుడు కూల్‌గానే జైలులో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News