Thursday, January 23, 2025

’18 పేజెస్’ సినిమాతో నన్ను చూసే విధానం మారిపోయింది: సరయు

- Advertisement -
- Advertisement -

18 పేజిస్ సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.?
చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న బాగి కేరక్టర్ కి మంచి పేరు వచ్చింది. వరుసగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయ్. దాదాపు రెండేళ్లు అయింది సినిమా జరిగిపోయి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక మంచి అప్లాజ్ వస్తుంది.

18 పేజెస్ అవకాశం ఎలా వచ్చింది.?
నా యూట్యూబ్ వీడియోస్ వలనే ఈ అవకాశం వచ్చింది. గీతా ఆర్ట్స్ కి నుంచి కాల్ వచ్చింది. ఆడియన్స్ కి అటెండ్ అవ్వమన్నారు. నాకు గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ నుంచి కాల్ వస్తే నమ్మబుద్ధి కాలేదు. వెళ్లి అటెండ్ అయి ఆడిసన్ ఇచ్చాను సెలెక్ట్ అయ్యాను.

Sarayu interview on 18 pages Movieసినిమాలో త్రో అవుట్ ఉంటారు, నిఖిల్ తో వర్కింగ్ ఎక్సపీరియన్స్ ఎలా ఉంది.?
నిఖిల్ తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్సపీరియన్స్ అండి, యూట్యూబ్ లో వీడియోస్ చేయడం వేరు సినిమా చేయడం వేరు నేను కొంచెం నెర్వస్ గా ఫీల్ అయినా కూడా, ఇట్స్ ఒకే మీరు మంచి యాక్టరస్ మీ వీడియోస్ చూస్తుంటాను నేను అని ప్రతి దానికి మంచిగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసారు.నిఖిల్ తో వర్క్ చెయ్యడం చాలా హ్యాపీగా అనిపించింది.

ఈ సినిమాలో మీకు మీ రోల్ ను చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు.?
ఈ సినిమాలో బాగి రోల్ చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఎక్సయిటెడ్, సినిమాలో త్రో అవుట్ ఉంటుంది అమ్మ మీ రోల్. కామెడీ, మెచ్యూరిటీ, నాటి అన్ని ఉన్నాయి ఈ కేరక్టర్ లో ఉంటాయి సో ఇది నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. నా వీడియోస్ కూడా అలానే డిఫరెంట్ గా ఉంటాయి.

దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి గురించి మాటల్లో..
సూర్య ప్రతాప్ గారు గ్రేట్ డైరెక్టర్ అండి, ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు పెద్ద డైరెక్టర్ వర్క్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేది కాదు. ఆయన ఎప్పుడు సెట్ లో జోక్స్ వేస్తూ ఉండేవారు. ఆయన ఒక బ్రదర్ లా ఫ్యామిలీ మెంబర్ లా ఉండేవారు మాతో , ఒక యాక్టర్ ను ఎంతవరకు మోల్డ్ చెయ్యాలో ఆయనకు తెలుసు. ఇలాంటి సబ్జెక్టు ను డీల్ చేయడం చాలా కష్టం. ఆయన పొయిటిక్ గా అద్భుతంగా చూపించారు సినిమాను.

Sarayu interview on 18 pages Movie18 పేజిస్ కి ముందు 18 పేజిస్ తరువాత సరయు అంటే ఏమి చెప్తారు.?
18 పేజిస్ కి ముందు అంటే నన్ను ఒక యూట్యూబర్ గానే చూసే వారు. అడల్ట్ కామెడీ కదా, కానీ దీనిలో సరయు అంటే ఈమెలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా.? వావ్ తిను ఇలా డీసెంట్ కామెడి కూడా చెయ్యగలదా.?
వావ్ షి ఈజ్ ఏ అమైజింగ్ యాక్టర్స్ అని ఒక పెద్ద బ్యానర్ లో సినిమా చేసిన తరువాత ఒక మంచి గౌరవం వచ్చింది.

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు, మరి యూట్యూబ్ కూడా కంటిన్యూ చేస్తారా ఓన్లీ సినిమాలు చేస్తారా.?
అంటే తెలియదు అండి, మంచి కాసెప్ట్స్ వస్తే యూట్యూబ్ కంటిన్యూ చేస్తాను అంటే మన రూట్స్ మనం మర్చిపోకూడదు కదా. మన మూలాలు మనం మర్చిపోకూడదు కాబట్టి మంచి కాన్సప్ట్స్ వస్తే యూట్యూబ్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను.

మీరు బయట కూడా ఇలానే ఉంటారా.?
బయట నేను చాలా సాఫ్ట్ అండి, నేను చేసే వీడియోస్ బట్టి డిసైడ్ చెయ్యకూడదు, విలన్ రోల్ చేసినంతమాత్రాన బయట విలన్ అయిపోరు కదా. కేరక్టర్ ను ఎంత అడాప్ట్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. సెట్ లో కూడా నన్ను అందరు సరయు అని మర్చిపోయి నన్ను బాగిలా ట్రీట్ చేసారు.

Sarayu interview on 18 pages Movie18 పేజిస్ కి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కంప్లిమెంట్ ఏంటి.?
నేను ఒక వీడియోలో చూసాను అండి, సరయు లాంటి ఒక ఫ్రెండ్ ఉంటే, సరయులా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉంటె అబ్బాయిలు అందరు హీరోలే అని అది బెస్ట్ కాంప్లిమెంట్ లా ఫిల్ అయ్యాను.

మీ డ్రీం రోల్ ఏంటి.?
నాకు రమ్యకృష్ణ గారు అంటే చాలా ఇష్టం అండి, ఆవిడ నాకు ఇన్సిపరేషన్ ఫ్యూచర్ లో ఆమె చేసినలాంటి రోల్స్ కొన్నైనా చెయ్యాలని ఉంది.

మీకు హిందీ మీద మంచి కమెండ్ ఉంది కదా బాలీవుడ్ కి వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా.?
లేదు అండి టాలీవుడే ఈ రోజు వేరే స్థాయిలో ఉంది. RRR, పుష్ప , కార్తికేయ లాంటి సినిమాలు వచ్చాయి మన తెలుగులో. నేను ఢిల్లీ వెళ్లినా కూడా చాలా గర్వంగా చెప్పుకుంటా నేను టాలీవుడ్ లో వర్క్ చేస్తున్న అని.

మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి.?
చాలా ఉన్నాయండి, ఇప్పుడు చెప్పడం కంటే ఆ రోల్స్ చూస్తేనే బాగుంటుంది కదా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News