- Advertisement -
హీరో కార్తీ ’సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బంపర్ హిట్ అయ్యింది. సర్దార్ థియేటర్స్‌లో విడుదలైన కొద్ది రోజుల తర్వాత మేకర్స్ సినిమా పార్ట్ 2ని అధికారికంగా ప్రకటించారు. సర్దార్ 2కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఈ సినిమా షూటింగ్ ఈనెల 15న చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభం కానుంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహించనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది. సర్దార్ ఎండింగ్‌లో నెక్స్ మిషన్ కంబోడియాలో జరగబోతోందని తెలిపారు. సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.
- Advertisement -