Monday, December 23, 2024

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వారోత్సవాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి వారోత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లోని చిక్కడపల్లి చౌరస్తా లో తెలంగాణ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బలాగౌని వెంకటేష్ గౌడ్, ఇతర గౌడ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News