Tuesday, January 21, 2025

బహుజన రాజ్యాధికార యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి టౌన్ : బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ ఆనాటి పాలకుల దౌర్జన్యాలను అరాచకాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరు డు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆ వీరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మెన్ షాహెద్, పిఎసిఎస్ చైర్మెన్ జనార్ధన్ రెడ్డి, ఎంపిపి మనోహర, కౌన్సిలర్లు సూర్యప్రకాష్, బోజిరెడ్డి, పట్టణ మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ బాలయ్య, డైరెక్టర్లు శ్రీనివాస్ యాదవ్, గంగాధర్, గౌడ సంఘం పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్, నాయకులు బాలస్వామి గౌడ్, రవి గౌడ్, కృష్ణ గౌడ్, రుక్కుల్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, నరేష్ గౌడ్, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News