Monday, December 23, 2024

టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌లో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ (టిఎస్‌ఎన్‌పిడిసిఎల్) కార్పోరేట్ కార్యాలయంలో మంగళవారం సర్దార్ వల్లబాయి పటేల్ జయంతిని (జాతీయ ఐక్యతా దినోత్సవం) ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు దేశ ఐకమత్యం సమగ్రత భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతామని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరితో విస్తరింప చేయడానికి గట్టిగా కృషి చేస్తామని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నామని సంస్థ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

అంతే కాకుండా దేశ ఐకమత్యం, సమగ్రత కాపాడేందుకు పాటు పడతానని, నా దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేసేందుకు స్వీయ తోడ్పాటు అందిస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బి. వెంకటేశ్వర్ రావు, పి.గణపతి, పి.మోహన్ రెడ్డి ,వి. తిరుపతిరెడ్డి , బి. వెంకటేశ్వర్ రావు డైరెక్టర్, (హెచ్‌ఆర్డీ ) పి.గణపతి డైరెక్టర్ (ఐపిసి,ఆర్‌ఎసి), పి.మోహన్ రెడ్డి డైరెక్టర్ (ఆపరేషన్,ప్రాజెక్ట్) వి. తిరుపతి రెడ్డి ఇంచార్జ్ డైరెక్టర్(ఫైనాన్స్) , ఛీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.జనార్ధన్, సి.జి.ఎంలు సదర్‌లాల్, మధుసూదన్, మోహన్ రావు, రవీంధ్రనాథ్, కె.ఎస్.గుట్ట కిషన్, అశోక్ , జాయింట్ సెక్రటరి కె. రమేష్ ,జి.ఎంలు, డిఈలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News