- Advertisement -
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన సర్దార్జీ అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులుగా ఎంపిక అయ్యారు. బుధవారం ఈ ప్రక్రియ పూర్తయింది. అంతర్జాతీయ ఆర్థిక ద్రవ్యవ్యవహారాలలో కీలక నిర్ధేశిత సూచికగా నిలిచే ప్రపంచ బ్యాంక్‌కు చెందిన 25 సభ్యదేశాలతో కూడిన కార్యనిర్వాహక మండలి సమావేశంలో బంగాను ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నుకున్నారు. దీనితో మాస్టర్‌కార్డు మాజీ సిఇఒ అయిన అజయ్ బంగా జూన్ రెండవ తేదీనుంచి ఈ కీలక సంస్థ అధ్యక్షులుగా ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు. జూన్‌తో పదవీకాలం ముగిస్తే ఇప్పటి సారథి డేవిడ్ మల్పాస్ నుంచి అజయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షులుగా అజయ్ బంగా పేరును ఫిబ్రవరిలోనే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ నామినేటు చేశారు. ఒకప్పటి భారతీయుడు, ఇప్పుడు అమెరికా పౌరుడు అయిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ పీఠం చేజిక్కించుకున్నారు.
- Advertisement -